For Money

Business News

ఎయిర్‌ టెల్‌ ప్రి పెయిడ్‌ బాదుడు

ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్‌ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్‌ టెల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ చార్జిని రూ. 79 నుంచి రూ. 99లకు పెంచింది. అంటే ఏకంగా 25 శాతం పెంచిందన్నమాట. అలాగే రూ. 149 ప్యాకేజీ ధర రూ. 179కి చేరింది. అలాగే డేటా టాపప్స్‌ ధరను కూడా పెంచింది. ఇపుడు 3జీబీ డేటా రూ. 48 ఉండగా.. రూ. 58కు పెంచింది. అదే 12 జీబీ డేటా కావాలంటే రూ. 118 కట్టాలి. ఇపుడు రూ. 98 ఉంది. 50 జీబీ డేటా ధరను రూ 251 నుంచి రూ. 301లకు కంపెనీ పెంచింది. పెద్ద ప్యాకేజీ రేట్లను పరిశీలించినా… చార్జీలను కంపెనీ కనీసం 20 శాతం పెంచింది. ఇతర డేటా వివరాలను దిగువ వచ్చిన పట్టికలో చూడండి.