NIFTY TODAY: 17,900 కీలకం
నిఫ్టిలో అమ్మకాలు వస్తున్నా… సూచీ మాత్రం టెక్నికల్‌గా బలహీనంగా లేదు. 17,900-17,930 ప్రాంతంలోని నిఫ్టికి మద్దతు అందే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17,999. నిఫ్టి ప్రస్తుత స్థాయిలో నిలదొక్కుకుంటుందా లేదా క్రమంగా బలహీనపడుతోందా తేలడానికి ఇంకాస్త సమయం పడుతుందని అనలిస్టులు అంటున్నారు. నిఫ్టి ఏమాత్రం పెరిగినా 18030, 18065 వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురు కావొచ్చు. సింగపూర్ నిఫ్టి పరిస్థితి చూస్తుంటే నిఫ్టి నష్టాల్లో ప్రారంభమయ్యేలా ఉంది. నిఫ్టికి 17930 ప్రాంతంలో మద్దతు అందుతుందేమో చూడండి. అక్కడ కాదంఏ 17900-17910 ప్రాంతంలో రావాలి. 17880 దిగువకు వెళితే భారీ నష్టాలు ఉంటాయని టెక్నికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 17880 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయొచ్చని… కాని నిఫ్టి లెవల్స్‌ను ఎప్పటికపుడు గమనిస్తూ ట్రేడింగ్ వ్యూహం మార్చుకోవాలని సూచిస్తున్నారు. నిఫ్టి బలహీనంగా లేకున్నా…బలంగా మాత్రం లేదు. పైగా రేపు వీక్లీ డెరివేటివ్స్ సెటిల్మెంట్ ఉంది.