For Money

Business News

ఓపెనింగ్‌లోనే నిఫ్టిపై ఒత్తిడి

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైంది. బ్యాంక్‌ నిఫ్టి ఓపెనింగ్‌లోనే నిఫ్టి దెబ్బతీసింది. 18127 పాయింట్ల వద్ద నిఫ్టి 18132కి చేరిన కొన్ని నిమిషాల్లో 18,063ని తాకింది. ప్రస్తుతం 33 పాయింట్ల నష్టంతో 18,076 వద్ద ట్రేడవుతోంది. మిడ్‌క్యాప్‌ సూచీ ఒక్కటి స్వల్ప లాభంలో ఉన్నా…అన్ని సూచీలు నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి అత్యధికంగా అర శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న లిస్టయిన సిగాచి ఇండస్ట్రీస్‌ ఇవాళ కూడా 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాలర్‌తో క్రూడ్‌ పెరగడంతో మెటల్స్‌, పెయింట్‌ కంపెనీలపై ఒత్తిడి కన్పిస్తోంది. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్లలో కోఫోర్జ్‌ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది.