రూ. 2,100 పెరిగిన వెండి…
స్పాట్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో పెద్ద మార్పు లేదు. పది గ్రాముల బంగారం స్టాండర్డ్ బంగారం రూ. 260 పెరగ్గా, వెండిలో పెద్ద మార్పులేదు. ఇక హైదరాబాద్‌లో స్టాండర్డ్ బంగారం రూ.49,310 కాగా, ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం రూ. 45,200 ప్రాంతంలో ఉంది. ఇవాళ మలబార్ గోల్డ్ ఇదే రేటుకు నగలను విక్రయించింది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పు రేపు మన మార్కెట్లలో కన్పించవచ్చు.
ఎంసీఎక్స్‌లో భారీ లాభాలు
మల్టి కమాడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్)లో బంగారం (డిసెంబర్ కాంట్రాక్ట్) ఇవాళ రూ.747 పెరిగి రూ.49,029 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ఏకంగా రూ.2100 పెరిగి రూ.66,650 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు డాలర్ కూడా పెరగడంతో మనదేశంలో బులియన్ ధరలు భారీగా పెరుగుతాయి. సాధారణంగా డాలర్ పెరిగితే బులియన్ తగ్గడం లేదా డాలర్ తగ్గితే బులియన్ పెరుగుతోంది. కాని ఇవాళ డాలర్ 0.7 శాతం పెరగ్గా… బంగారం 1.3 శాతం, వెండి 3 శాతం చొప్పున పెరిగాయి.