NIFTY TODAY: 17,900పైన నిలబడుతుందా?
నిఫ్టి ఇవాళ పరీక్షను ఎదుర్కోనుంది. నిఫ్టికి 17900పైన నిలబడుతుందా లేదా అన్నది మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది అనలిస్టులు నిఫ్టి 17950 ప్రాంతంలో మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. పతనం మరీ తీవ్రంగా ఉంటే నిఫ్టి 17845 లేదా 17,790 ప్రాంతానికి చేరొచ్చని వీరేందర్ కుమార్ సీఎన్‌బీసీ ఆవాజ్ ప్రేక్షకులకు తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్ల కూడా భారీగా అమ్ముతున్నారు. నిన్న ఏకంగ ఆరూ. 2440 కోట్ల మేరకు అమ్మకాలు చేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1418 కోట్ల కొనుగోళ్ళు మాత్రమే చేయగలిగారు. దీంతో విదేశీ ఇన్వస్టర్ల నికర అమ్మకాలు రూ. 1229 కోట్లుగా తేలాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టిని కూడా ఎలా చూడాలని అనే అంశంపై అవగాహన కోసం ఈ వీడియో చూడండి.