నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
నిన్న సంవత్ 2078ని నష్టాలతో ప్రారంభించిన నిఫ్టి ఇవాళ కూడా నష్టాలను కొనసాగించనుంది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో కి జారుకున్న నేపథ్యంలో మన మార్కెట్‌లో కూడా ఒత్తిడి రానుంది. రాత్రి అమెరికా మార్కెట్లు అర శాతంపైగా నష్టంతో ముగిశాయి. అనూహ్యంగా రాత్రి క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో వర్ధమాన దేశాల్లో ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసియా మార్కెట్లన్నీ భారీ నష్టాల్లో ట్రేడ్ ఉన్నాయి. నిక్కీ ఒక్కటే అర శాతం నష్టంతో ఉంది. మిగిలిన మార్కెట్లన్నీ ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. చైనా మార్కెట్ నష్టాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 120 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టికి ఇవాళ కీలక పరీక్ష ఎదురు కానుంది.