నిలకడగా ప్రారంభమైన నిఫ్టి
నిఫ్టి దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 18,092కి వెళ్ళినా… ప్రస్తుతం 6 పాయింట్ల లాభంతో 18,074 వద్ద ట్రేడవుతోంది. మిడ్ క్యాప్ సూచీ కూడా స్వల్ప లాభాలకే పరిమితమైంది. బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. 37 షేర్లు లాభాల్లో ఉన్నా.. అవన్నీ నామమాత్రమే. ఇక కంపెనీలవారీగా చూస్తే… నిన్న భారీగా క్షీణించిన దివీస్ ల్యాబ్ ఇవాళ టాప్ గెయినర్‌గా మూడు శాతం లాభంతో ట్రేడవుతోంది. కంపెనీ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో బ్రిటానియా షేర్ 5 శాతం దాకా నష్టపోయింది. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కోసం పీఈ పెట్టుబడుల కోసం టీవీఎస్ మోటార్స్ ప్రయత్నిస్తోందన్న వార్తలతో ఈ షేర్ ఇవాళ 8 శాతం దాకా పెరిగింది.