నిరుత్సాహపర్చిన అరబిందో ఫార్మా
సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా మార్కెట్ అంచనాలను చేరుకోలేకపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం నుంచి మార్జిన్ వరకు అన్ని అంశాల్లో కంపెనీ పనితీరు క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా రూ. 5,942 కోట్ల అమ్మకాలపై రూ. 696.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది కాలంలో కంపెనీ టర్నోవర్ రూ. 6483 కోట్ల కాగా, నికర లాభం రూ. 806 కోట్లు. టర్నోవర్ 8.4 శాతం క్షీణించగా, నికర లాభంతో 14 శాతం దాకా తగ్గింది. కంపెనీ మార్జిన్ కూడా 22.1 శాతం నుంచి 20 శాతానికి పడిపోయింది.