దిగువ స్థాయిలో నిఫ్టికి మద్దతు
నిఫ్టికి ఉదయం ఊహించినట్లే 17,830-17840 ప్రాంతంలో మద్దతు లభించింది. అక్కడి నుంచి నిఫ్టి రికార్డు స్థాయిలో 230 పాయింట్లు పెరిగింది. ముఖ్యంగా మిడ్ సెషన్ నుంచి నిఫ్టి జోరందుకుని ఓపెనింగ్ స్థాయిని దాటి 18,087కి చేరింది. చివర్లో స్వల్పంగా తగ్గి 152 పాయింట్ల లాభంతో 18,068 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నుంచి ఎలాంటి మద్దతు లేకున్నా నిఫ్టి ఈ స్థాయిలో పెరగడం విశేషం. ఇండస్ ఇండ్ బ్యాంక్, దివీస్ ల్యాబ్‌ల నష్టాలను పక్కన బెడితే… మార్కెట్ భారీగా పెరిగినట్లు లెక్క. మరోవైపు మిడ్ క్యాప్ సూచీ కూడా 1.5 శాతం పెరగడం విశేషం. నిఫ్టిలో 40 షేర్లు లాభాలతో ముగిశాయి. అనూహ్యంగా ఇవాళ టైటాన్ టాప్ గెయినర్‌గా నిలిచింది. మిడ్ క్యాప్‌లో కెనరా బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచింది.