నిమిషాల్లో 130 పాయింట్లు డౌన్
కొత్త సంవత్ ప్రారంభంలో మార్కెట్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 150 పాయింట్లు కోల్పోయింది. 18,040 వద్ద ప్రారంభమైన మార్కెట్ పది నిమిషాల్లోనే 17,887ని తాకింది. ఓపెనింగ్‌లో లాభాల్లో నిఫ్టి షేర్ల సంఖ్య 46 నుంచి 24కు పడింది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్ నుంచి రెడ్‌లోకి వచ్చింది. ఒక శాతం లాభంతో ప్రారంభమైన మిడ్ క్యాప్ సూచీ కూడా లాభాలన్నీ కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టి దాదాపు ఒక శాతం నష్టపోయింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్‌కు చెందిన భారత్ ఫైనాన్షియల్‌పై నెగిటివ్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వసూలు కాని రుణాలను భారత్ ఫైనాన్షియల్ దాస్తోందన్న ఆరోపణలతో ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ పది శాతం క్షీణించింది. అలాగే దివీస్ ల్యాబ్ 8 శాతం క్షీణించింది. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందుతుందేమో చూడాలి.