MID SESSION: 233 పాయింట్లు జంప్
మార్కెట్ ఇవాళ జోరు మీద ఉంది. 17,820 స్థాయిని చాలా సులభంగా దాటేసింది. మిడ్ సెషన్ వరకు తొలి నిరోధక స్థాయి 17820 ప్రాంతంలోనే ఉంది. కాని యూరో మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ప్రారంభం కావడం, అమెరికా ఫ్యూచర్స్ గ్రీన్‌లో ఉండటంతో బ్యాంకు షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. బ్యాంక్ నిఫ్టి 1.42 శాతం పెరగ్గా, నిఫ్టి మిడ్ క్యాప్ షేర్ల సూచీ కూడా ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. టెలికాం రంగం ఉదయం నుంచి వెలుగులో ఉంది. ఇక మెటల్స్, ఐటీ కౌంటర్లకు కూడా మద్దతు భారీగా లభిస్తోంది. డాలర్ బలపడటమే దీనికి ప్రధాన కారణం. నిఫ్టి ప్రస్తుతం 233 పాయింట్ల లాభంతో 17,904 వద్ద ట్రేడవుతోంది.