25 శాతం క్షీణించిన IRCTC
ప్రయాణీకుల నుంచి వసూలు చేసే ఫీజుల నుంచి 50 శాతం ఐఆర్సీటీసీ కంపెనీ తనకు చెల్లించాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో ఈ కంపెనీలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. తాజా సమాచారం మేరకు ఐఆర్సీటీసీ రూ. 685 వద్ద 25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ స్థాయిలోనూ కొనేవారు లేరు. ఎన్ఎస్ఈలో ఈ ధర వద్ద అమ్మకానికి 60 లక్షల షేర్లు రెడీగా ఉన్నాయి. ఈ ఒక్క రోజే షేర్ రూ.228 క్షీణించింది. మరోవైపు పదిగంటలకు ఐఆర్సీటీసీ సీఎండీతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఈ చర్చల ఫలితాల కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది.