ఫేస్‌బుక్ ఇక మెటా
‘ఫేస్‌బుక్’ కంపెనీ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. భవిష్యత్తులో వర్చువల్ రియాలిటీ సాంకేతికత (మెటావర్స్)కు పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్ కంపెనీ అధీనంలోని సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ పేరును మాత్రమే మార్చారు.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021