NIFTY TRADE: పెరిగితే అమ్మండి
మంత్లీ, వీక్లీ డెరివేటివ్స్‌కు ఇవాళ క్లోజింగ్. కార్పొరేట్ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మెజారిటీ కంపెనీలు, మారుతీ వంటి పెద్ద కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా నిఫ్టి స్థిరంగా ప్రారంభం కానుంది. నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైతే… ఎక్కడిదాకా వెళుతుందో చూడండి. నిఫ్టి క్రితం ముగింపు 18,210. నిఫ్టికి తొలి ప్రతిఘటన 18260 వద్ద ఎదురు కానుంది. తరవాతి ప్రతిఘటన 18,290.18,310 స్థాయిని దాటితే నిఫ్టి గ్రీన్ జోన్లోకి వెళ్ళొచ్చు. కాని ఆ పరిస్థితి ఇవాళ రాకపోవచ్చు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు 18250-18260 ప్రాంతంలో అమ్మొచ్చు. నిఫ్టికి ఇవాళ్టికి కీలక స్థాయి 18220. ఈ స్థాయికి పైన ఉన్నంత వరకు నిఫ్టికి పెద్ద ఢోకా ఉండదు. ఈ స్థాయికి దిగువకు వస్తే మాత్రం 18160 ప్రాంతంలో మద్దతు అందాలి. ఆ తరువాతి స్థాయి 18130.ఈ స్థాయి దిగువకు వస్తే మాత్రం భారీ నష్టాలకు ఆస్కారం ఉంది. నిఫ్టిలో ఎలాంటి బలం లేదు. బీ కేర్‌ఫుల్. రిస్క్ వొద్దనుకునేవారు ఇవాళ ట్రేడింగ్‌కు దూరంగా ఉండటం మంచిది.