సింటెక్స్ కోసం రిలయన్స్ బిడ్
దివాలా తీసిన సింటెక్స్ కంపెనీ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రయత్నిస్తోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సింటెక్స్ కంపెనీ అమ్మకానికి ఇప్పటికే బిడ్లు ఆహ్వానించారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లకు ఫ్యాబ్రిక్‌ను సింటెక్స్ ఇండస్ట్రీస్ సరఫరా చేస్తోంది. ఏప్రిల్‌లో ఈ కంపెనీ రుణదాతలు ఎన్సీఎల్టీ కేసు పెట్టారు. అలోక్ ఇండస్ట్రీస్‌కు మినహా ఇప్పటి వరకు దివాలా కంపెనీల కోసం రిలయన్స్ ప్రయత్నించలేదు. అలోక్ ఇండస్ట్రీస్‌ను కారు చౌకగా కంపెనీ తీసుకుంది. అలోక్ ఇండస్ట్రీస్ అప్పుల్లో దాదాపు 95 శాతంపైగా రుణాలను బ్యాంకులు రద్దు చేసి… ఆ కంపెనీని రిలయన్స్‌కు అప్పగించాయి. ఇపుడు సింటెక్స్ కోసం రిలయన్స్‌తో పాటు 13 కంపెనీలో బరిలో ఉన్నాయి. పోటీ పడుతున్నవారిలో ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు వెల్స్పన్ కూడా ఉంది.