భువనేశ్వర్‌తో పాటు తిరుపతి ఇచ్చేస్తారు
ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా అంటే మార్చిలోగా తిరుపతితో సహా 13 చిన్న ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయం తీసుకోనుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ కింద ఈ 13 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు పౌర విమానయాన శాఖకు బిడ్ ప్రతిపాదనలు పంపారు. ఒక్కో ప్యాసింజర్‌కు సగటున వచ్చే ఆదాయం ఆధారంగా ఈ పోర్టులను ప్రైవేటీకరిస్తారు. ఆరు పెద్ద విమానాశ్రయాలకు ఏడు చిన్న విమానాశ్రయాలను కలిపి అమ్ముతున్నారు.
దేనికి ఏ పోర్టు కలుపుతారు
వారణాసితో పాటు కుషినగర్, గయా
అమృత్‌సర్‌తో పాటు కంగారా
భువనేశ్వర్‌తో పాటు తిరుపతి
రాయపూర్‌తో పాటు ఔరంగాబాద్
ఇండోర్‌తోపాటు జబల్‌పూర్
త్రిచ్చితో పాటు హుబ్లి