For Money

Business News

నైకా ఐపీఓ 28న ప్రారంభం

బ్యూటీ ప్రొడక్ట్స్‌ తయారు చేసే నైకా సంస్థ ఐపీఓ ఈ నెల 28న ప్రారంభం కానుంది. నవంబర్ 1న ముగుస్తుంది. నైకా పబ్లిక్‌ ఆఫర్‌కు మాతృతసంస్థ FSN ఈ-కామర్స్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌కు సెబీ నుంచి అనుమతి లభించింది. ఐపీఓ ద్వారా రూ.5,200 కోట్లు సమీకరించాలని కంపెనీ నిర్ణయించింది. తాజా షేర్ల ద్వారా రూ.630 కోట్లు సమీకరిస్తుండగగా, మరో 41,972,660 షేర్లను ఇపుడు ఉన్న వాటాదారులు ఈ ఆఫర్‌ కింద అమ్ముకుంటారు. కంపెనీ విలువను 740 కోట్ల డాలర్లుగా అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,440 కోట్ల ఆదాయాన్ని నైకా ఆర్జించింది. ఈ కంపెనీ వద్ద 1,500 వరకు ప్రొడక్ట్స్‌ ఉన్నాయి.