For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

ప్రపంచ మార్కెట్లలో పెద్ద ఉత్సాహం లేదు. కార్పొరేట్‌ ఫలితాలకు ఆయా కంపెనీలు స్పందిస్తున్నాయి…కాని మార్కెట్‌ను ప్రభావితం చేసే ఫలితాలు రావడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్‌లో అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా… చివర్లో లాభాల స్వీకరణ కారణంగా నాస్‌డాక్‌ నష్టాల్లోముగిశాయి. మిగిలిన రెండు సూచీలు 0.4 శాతం లాభంతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా స్తాబ్దుగా ఉన్నాయి. నిక్కీ స్వల్ప నష్టాల్లో ఉండగా, చైనా సూచీలు పరవాలేదు. ఎవర్‌గ్రాండేలో ట్రేడింగ్‌ ప్రారంబమైంది. చైనా A50 0.8 శాతం లాభంతో ఉంది. షాంఘై సూచీ కూడా అర శాతం లాభంతో ఉంది. హాంగ్‌కాంగ్‌ క్రితం ముగింపు వద్దే. సింపూర్‌ నిఫ్టి స్వల్ప లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరం లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.