NIFTY TRADE: 18,467 కీలకం
అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌గా ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ ఒక శాతం లాభంతో ఉండటం మన మార్కెట్ పాజిటివ్‌గానే చెప్పాలి. కాని కొన్ని వారాల నుంచి హాంగ్‌సెంగ్‌ను భారత మార్కెట్ ట్రాక్ చేయడం మానేసింది. పైగా హాంగ్‌సెంగ్ పడినపుడు మన మార్కెట్లు పెరిగాయి. కాబట్టి ఇవాళ హాంగ్‌సెంగ్ పెరిగితే మన మార్కెట్‌కు నెగిటివ్ అవుతుందా అనేది చూడాలి. నిఫ్టి క్రితం ముగింపు 18418. నిఫ్టికి ఇవాళ కీలక స్థాయి18,465. ఈ స్థాయిని దాటితే 18,490 దాకా వెళ్ళవచ్చు. ఒక నిఫ్టి గనుక ఈ స్థాయి దాకా వస్తే 17,520 స్టాప్ లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. నిఫ్టిలో వెంటనే ట్రేడ్ చేయొద్దు. ఆగి లెవల్స్ చూడండి. నిఫ్టి గనుక18465 దిగువకు వస్తే 18,350 దాకా మద్దతు లేదు. అంటే పెరగడానికి ఇబ్బంది ఉంది కాని… పడితే నష్టాలు భారీగా ఉంటాయి. నిన్నటి కనిష్ఠ స్థాయిని నిఫ్టి మళ్ళీ తాకుతందా అనేది చూడండి.