For Money

Business News

NIFTY LEVEL: పెరిగితే అమ్మడమేనా?

నిఫ్టి ఇవాళ కీలక స్థాయిలను పరీక్షించనుంది. ముఖ్యంగా నిన్నటి కనిష్ఠ స్థాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు నిక అమ్మకాలు రూ. 505 కోట్లు కాగా, దేశీయ ఇన్వెస్టర్ల నికర అమ్మకాలు రూ. 2578 కోట్లు ఉన్నాయి. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.576 కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో ఇద్దరూ భారీగా కొనుగోలు చేశారు. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా (రూ. 2,147 కోట్లు) అమ్మకాలు జరిపారు. నిఫ్టి ప్రస్తుత స్థాయిలో నిలదొక్కుకుంటుందేమో చూడాలి. నిఫ్టి గనుకు 18350 ప్రాంతానికి వస్తే మాత్రం మద్దతు లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.