IRCTC: ఒకే సెషన్లో రూ.1,400 డౌన్
గత కొన్ని రోజులుగా పట్టపగ్గాల్లేకుండా పెరిగి ఐఆర్సీటీసీ, టాటా పవర్లో ఇవాళ ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ ఐఆర్సీటీసీ కౌంటర్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించడంతో పదిశాతం లోయర్ సీలింగ్ పడింది. కొద్ది నిమిషాల తరవాత మరో 5 శాతం లోయర్ సీలింగ్ పడింది. ఈలోగా ట్రేడింగ్ సమయం పూర్తి కావడంతో ఈ షేర్ 15 శాతం నష్టంతో ముగిసింది. అంటే క్రితం ముగింపుతో పోలిస్తే ఈ షేర్ రూ. 881 నష్టంతో ముగిసింది. కాని ఇవాళ్టి గరిష్ఠ స్థాయితో పోలిస్తే ఈ షేర్ ఒకే సెషన్లో రూ. 1700 పడింది. ఇవాళ 2 గంటలకు కూడా ఈ షేర్ రూ.6,396 వద్ద ట్రేడైంది. అంతే అక్కడి నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడతో రూ. 4,996 వద్ద ముగిసింది. రేపు మార్కెట్కు సెలవు కాబట్టి… ఎల్లుండి ఈ షేర్లో ట్రేడింగ్ ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు టాటా పవర్ కూడా ఇవాళ రూ. 267కు చేరి… అక్కడి నుంచి రూ. 221కి పడిపోయింది. క్లోజింగ్లో కాస్త కోలుకుంది. ఇటీవల బాగా పెరిగిన అనేక రియాల్టీ షేర్లు కూడా బాగా పడ్డాయి.
నిఫ్టి టాప్ గెయినర్స్
టెక్ మహీంద్రా 1,542.70 4.26
ఎల్ అండ్ టీ 1,848.00 3.33
ఇన్ఫోసిస్ 1,823.50 1.75
కొటక్ బ్యాంక్ 2,044.00 1.61
బజాజ్ ఫిన్ సర్వ్ 18,935.80 1.38
నిఫ్టి టాప్ లూజర్స్
ఐటీసీ 246.10 -6.27
టాటా మోటార్స్ 484.75 -4.88
ఐషర్ మోటార్స్ 2,699.00 -4.51
హిందుస్థాన్ లీవర్ 2,557.30 -3.64
టైటాన్ 2,496.00 -3.58
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
ఎల్ అండ్ టీ టెక్ 5,215.00 7.49
ఎంఫసిస్ 3,553.00 5.85
కోఫోర్జ్ 5,830.00 4.02
శ్రీరామ్ట్రాన్స్ ఫిన్ 1,425.50 2.17
ఎం అండ్ ఎం ఫిన్ 190.30 1.52
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
ఐఆర్సీటీసీ 4,996.05 -15.00
టాటా పవర్ 225.75 -12.26
భెల్ 69.60 -6.70
ఐడియా 9.95 -6.13
ఆస్ట్రాల్ 2,255.00 -5.36