క్రూడ్ 85 డాలర్లు దాటేసింది
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ జోరకు అడ్డే లేకుండా ఉంది. ఒక రోజు స్వల్పంగా తగ్గినా.. వెంటనే జెట్ స్పీడుతో పెరిగింది. ఇవాళ ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ 85 డాలర్లను దాటింది. ఇక అమెరికా మార్కెట్లో ట్రేడయ్యే WTI క్రూడ్ ధర 82.40 డాలర్లకు చేరింది. క్రూడ్ 100 డాలర్లకు చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడంతో క్రూడ్ మార్కెట్ సెంటిమెంట్ మరింత బలపడింది. పైగా డాలర్ కూడా క్షీణించి ఇపుడు నిలకడగా ఉంది. అమెరికా నుంచి వస్తున్న ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకాలు బాగుండటంతో… క్రూడ్ డిమాండ్ మరింత పెరుగుతుందని ఒపెక్ దేశాలు భావిస్తున్నాయి.