పండుగ పూట… కళ తప్పిన బులియన్
స్టాక్ మార్కెట్లు దూసుకెళుతున్న సమయంలో బులియన్ మళ్ళీ డల్‌గా ట్రేడైంది. దసరా పండుగ సందర్భంగా కమాడిటీస్ మార్కెట్లో సాయంత్రం సెషన్ ట్రేడింగ్ ప్రారంభమైంది. డాలర్ ఇండెక్స్ స్థిరంగా ఉన్నా బులియన్ మార్కెట్లో అమ్మకాలు రావడం విశేషం. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1.75 శాతం తగ్గగా, వెండి స్వల్పంగా తగ్గింది. అయితే మనదేశంలో ఎంసీఎక్స్‌లో మాత్రం వెండి, బంగారం ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నవంబర్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ రూ.550 నష్టపోగా, డిసెంబర్ నెల కాంట్రాక్ట్ రూ. 600 నష్టంతో ట్రేడవుతోంది. వెండి నవంబర్ కాంట్రాక్ట్ రూ.200, డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.250 చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి.