For Money

Business News

నేడూ లాభాల్లో వాల్‌స్ట్రీట్‌

వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌ లాభాల్లో ప్రారంభమైంది. ద్రవోల్బణ భయాలు తగ్గడం, టాపరింగ్‌కు సంబంధించి క్లారిటీ రావడతో పాటు వస్తున్న కార్పొరేట్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాచాయి. అత్యధికంగా డౌజోన్స్‌ 0.9 శాతం లాభపడగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే నాస్‌డాక్‌ 0.3 శాతం లాభంతో ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ 94 దిగువకు వచ్చింది. మరోవైపు ఇవాళ ప్రపంచ మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. ఉదయం ఆసియా మార్కెట్లు బంపర్‌ లాభాలతో ముగిశాయి. నిక్కీ 1.8 శాతం హాంగ్‌సెంగ్‌లు 1.5 శాతం, తైవాన్‌ 2.4 శాతం లాభంతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలన్నీ అర శాతం పైనే లాభంతో ట్రేడవుతున్నాయి. యూరో స్టాక్స్‌ 50 సూచీ 0.8 శాతం లాభంతో ఉంది. దసరా పండుగ సందర్భంగా భారత స్టాక్‌ మార్కెట్లకు సెలవు.