For Money

Business News

దుమ్ము రేపుతున్న వాల్‌స్ట్రీట్‌

ఉద్దీపన ప్యాకేజికి మద్దతు ఉపసంహరణపై ఫెడరల్‌ బ్యాంక్‌ క్లారిటీ ఇచ్చేసింది. ఒక అనిశ్చితి తొలగింది. ఇదే సమయంలో టెక్నాలజీ షేర్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, యాపిల్, గూగుల్‌.. దాదాపు అన్ని ప్రధాన టెక్‌ షేర్లు ఒక శాతంపై లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ కంపెనీల కార్పొరేట్‌ ఫలితాలు బాగున్నాయి. దీంతో ఈ రంగానికి చెందిన షేర్లు కూడా పెరిగాయి. వెరశి నాస్‌డాక్‌, డౌ జోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 1.5 శాతం దాకా లాభంతో ట్రేడవుతున్నాయి. మొత్తానికి డాలర్‌ చల్లబడింది. క్రూడ్‌ నిల్వలు పెరిగినా… ధరలు తగ్గే పరిస్థితి కన్పించడం లేదు.