For Money

Business News

జీ టేకోవర్‌కు రిలయన్స్‌ ప్రతిపాదన?

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరిగుతోంది. సోని కంపెనీతో జీ ప్రమోటర్లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని… ప్రధాన ఇన్వెస్టర్‌ ఇన్వెస్కో తిరస్కరించిన విషయం తెలిసిందే. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జీ ప్రమోటర్లకు కేవలం 2 శాతం వాటా ఉంది. ప్రధాన వాటాదారు అయిన ఇన్వెస్కోతో సంబంధం లేకుండా సోనీతో డీల్‌ చేసుకుంది. జీ ప్రమోటర్ పునీత్‌ గోయెంకా (సుభాష్‌చంద్ర కుమారుడు)కు, ఇన్వెస్కోకు మధ్య సాగుతున్న ఈ పోరు ఇపుడు కోర్టుల దాకా వెళ్ళింది.
రిలయన్స్‌ ప్రస్తావన?
దేశంలోని అతి పెద్ద కంపెనీ (రిలయన్స్‌)తో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం కోసం ఇన్వెస్కో ప్రతిపాదన చేసిందని నిన్న జీ ప్రమోటర్లు బయట పెట్టారు. అయితే రిలయన్స్‌ కంపెనీ వ్యాల్యూయేషన్‌ రూ.10,000 కోట్లు అధికంగా ఉందని, ఒకవేళ డీల్‌ కుదిరితే జీ ఎంటర్‌టైమన్‌మెంట్‌ వాటాదారులు రూ.10,000 కోట్లు నష్టపోతారని పునీత్‌ గోయెంకా అంటున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని వాటాదారుల ముందు పునీత్‌ గోయెంకా ఎందుకు పెట్టలేదన్న వాదన ఇపుడు ముందుకు వస్తోంది. పునీత్‌ గోయెంకా అంతా లోపాయికారీగా చేస్తున్నారని ఇన్వెస్కో చేస్తున్న వాదనకు ఇపుడు మరింత బలం చేకూరింది. రిలయన్స్‌ నుంచి వచ్చిన ప్రతిపాదనను కూడా బోర్డులో పెట్టి చర్చించాల్సిందనే వాదన కూడా వస్తోంది. మొత్తాన్ని ఈ డీల్‌ విషయంలో రిలయన్స్‌ ప్రతిపాదన రావడంతో జీ షేర్‌ మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చింది.