ట్రూజెట్‌కు మెగా గుడ్‌బై
ప్రాంతీయ సేవల విమానయాన సంస్థ ట్రూజెట్ నుంచి మెగా ఇంజినీరింగ్ వైదొలగింది. ట్రూజెట్‌ను పాత యజమాని వంకాయలపాటి ఉమేష్‌కే అమ్మేసినట్లు తెలుస్తోంది. అయితే డీల్ వివరాలు వెల్లడించలేదు. ట్రూజెట్‌కు వెంటనే రూ. 300 కోట్లు అవసరమౌతాయని తెలుస్తోంది. ఐర్లాండ్‌కు చెందిన టర్పోప్రాప్ విమానాల లీజుదారు అయిన ఎలిక్స్ ఏవియేషన్ క్యాపిటల్ తాజాగా ట్రూజెట్‌లో ఈక్విటీ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఉమేష్ తెలిపారు. మరో 10 విమానాలు లీజుకు ఇచ్చేందుకు కూడా ఆసక్తిగా ఉందని తమ ఉద్యోగులకు రాసిన లేఖలో ఉమేష్ పేర్కొన్నారు. 2014లో కంపెనీలో మెజార్టీ వాటాను మెగా ఇంజనీరింగ్‌కు విక్రయించారు. అయితే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని, ఈ వ్యాపారం తమకు తగదని భావించిన మెగా ఇంజినీరింగ్… ఈ కంపెనీ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీన మెగా డైరెక్టర్లు రాజీనామా చేశారు.