నిఫ్టిపై వీరేందర్ కుమార్ వ్యూహం
నిన్న మార్కెట్ స్వల్ప భారీ లాభాలతో ముగిసినా… విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నిన్న ఎఫ్ అండ్ ఓ విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,764 కోట్ల నికర అమ్మకాలు చేయగా, దేశీయ ఇన్వెస్ట్లు రూ. 2,528 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. ముఖ్యంగా స్టాక్ ఫ్యూచర్స్ రూ. 2140 కోట్లు కొనుగోలు చేయగా, స్టాక్ ఆప్షన్స్ రూ. 137కోట్లు కొనుగోలు చేశారు. ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ. 1195 కోట్లు, ఆప్షన్స్‌లో రూ. 989 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ కూడా విదేశీ ఇన్వెస్టర్లు మద్దతు అందిస్తే నిఫ్టి 17,870కి చేరొచ్చని వీరేందర్ కుమార్ అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=j597sWTyRG4