నిఫ్టి: సూపర్ ఓపెనింగ్‌కు ఛాన్స్
రుణ సీలింగ్‌కు సంబంధించి అమెరికా చట్ట సభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య రాజీ కుదరడంతో ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమై… లాభాలతో ముగిశాయి. అయితే రాత్రి వాల్‌స్ట్రీట్ లాభాలు నామ మాత్రంగానే ఉన్నాయి. ఏ సూచీ అర శాతం కూడా పెరగలేదు. అయితే ఫ్యూచర్స్ అర శాతం లాభంతో ఉన్నాయి. భారీ నష్టాల నుంచి ఆసియా మార్కెట్లు ఇవాళ కోలుకున్నాయి. చైనా మార్కెట్లకు ఇవాళ కూడా సెలవు. జపాన్ నిక్కీ 1.5 శాతం లాభంతో ట్రేడ్ అవుతుండగా… హాంగ్‌కాంగ్, తైవాన్ సూచీలు 1.5 శాతం కన్నా ఎక్కువ లాభంతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 140 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి కూడా ఇదే స్థాయి లాభాలతో ప్రారంభం కానుంది.