వాల్‌స్ట్రీట్‌కు ‘వడ్డీ’ భయం
ఇవాళ విడుదలైన ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్… స్టాక్ మార్కెట్‌కు విలన్లా మారింది. సెప్టెంబర్‌లో ప్రైవేట్ కంపెనీలు 4.28 లక్షల మందికి ఉద్యగ అవశాకాలు కల్పిస్తాయని అనలిస్టులు అంచనా వేశారు. కాని ఏడీపీ రిపోర్టు ప్రకారం 5.68 లక్షల ఉద్యోగాల కల్పన జరగడంతో… గడువుకు కంటే వడ్డీ రేట్ల పెంచుతారన్న భయం మొదలైంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయంటే ఫెడరల్ రిజర్వ్ వెంటనే ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు గడువుకు ముందే ఆపుతుంది. అంటే మార్కెట్ నిధుల సరఫరా తగ్గుతుంది.దరిమిలా వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ లెక్కల డాలర్ ఇండెక్స్ ఇవాళ 0.6 శాతం పెరిగింది. ఫలితంగా నిన్న భారీగా క్షీణించిన వాల్‌స్ట్రీట్ ఇవాళ కూడా నీరసపడిపోయింది. డౌజోన్స్ ఇవాళ కూడా ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ అరశాతం నష్ట పోగా, నాస్డాక్ నామ మాత్రపు నష్టంతో ట్రేడవుతోంది. ఇటీవలి కాలంలో నాస్డాక్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది.