For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

నిన్న మన మార్కెట్లు భారీ లాభాలు గడించినా.. ప్రపంచ మార్కెట్లలో పరిస్థితి రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది. అమెరికాలో ఐటీ షేర్లలో వస్తున్న అమ్మకాల ఒత్తిడి కంగారు పెట్టిస్తోంది. క్రూడ్‌ పెరగడంతో అనేక ఎనర్జీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. దీంతో డౌజోన్స్‌ తక్కువ నష్టంతో ముగిసింది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 1.3 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఆసియా మార్కెట్లలో పరిస్థితి భిన్నంగా లేదు. నిన్న భారీ నష్టాలతో ముగిసిన జపాన్‌, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు ఇవాళ కూడా అదే స్థాయి నష్టాలతో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా జపాన్‌ నిక్కీ మూడు శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న మూడు శాతం దాకా పడిన హాంగ్‌సెంగ్‌ ఇవాళ కూడా 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి కూడా వంద పాయింట్లకు పైగా నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ 17600 దిగువన ఓపెన్‌ అవుతుందేమో చూడాలి.