హమ్మయ్య వస్తున్నాయ్!
జనం సామాజిక మీడియాతో ఎంత మమేకం అయిపోయారో చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనే ఉదాహరణ. ఏడు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడంతో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. ట్విటర్, యూట్యూబ్ వంటి పనిచేయడం సరిపోయింది. నిన్న రాత్రి రాత్రి 9 నుంచి ఈ మూడు యాప్‌లు డౌన్ అయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. ముఖ్యంగా వాట్సప్ డౌన్ కావడం చాలా మందికి టెన్షన్ తెప్పించింది. ఫోన్ ట్యాపింగ్ భయం ఉన్నవారు సాధారణ కాల్ కూడా వాట్సప్‌లోనే చేస్తుంటారు. చాలా సేపటి వరకు కంపెనీ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం వీటి వినియోగదారులు హైరానా పడ్డారు. ఎట్టకేలకు ఏడు గంటల తరవాత వీటి సేవలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. సామాజిక మీడియా యాప్‌లలో సాంకేతిక సమస్యలు రావడం సహజమే. కాకపోతే ఎన్నడూలేని విధంగా ఈ మూడు యాప్‌ల సేవలు 7 గంటలు స్తంభించడంపై నెటిజెన్లు విస్మయం వ్యక్తంచేశారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు ఈ సేవలను పునరుద్ధరించిన తరవాత ఫేస్బుక్ క్షమాపణలు చెప్పింది. వాట్సప్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లు ఫేస్బుక్ సొంత సంస్థలు.