బాబా రామ్‌దేవ్‌కు చీవాట్లు
రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ హామీలు చేసినందుకు బాబా రామ్‌దేవ్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీవాట్లు పెట్టింది. ఒక వైరల్ వీడియోలో రామ్‌దేవ్ తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘కోటీశ్వరులు కావాలనుకుంటే రుచి సోయా ఇండస్ట్రీస్ షేర్లను కొనండి’ అని సలహా ఇచ్చారు. ఎఫ్‌పీఓ ద్వారా కంపెనీ రూ. 4,500 కోట్ల నిధుల సేకరణకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు తప్పుడు హామీలు ఇవ్వడంపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోలో ఆయన ఇంకా ఏమన్నారంటే… ‘‘కోటీశ్వరుడు కావడానికి నేను నీకు మంత్రాన్ని ఇస్తున్నాను. ఈరోజే డీమ్యాట్ ఖాతాను తెరవండి. నేను మీకు చెప్పినప్పుడు రుచి సోయా షేర్లను కొనండి. ఆ తర్వాత పతంజలి షేర్లు. దీని మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు ఉందనే విషయాన్ని ఏదైనా గ్లోబల్ ఏజెన్సీ మీకు తెలియజేస్తుంది’ అని హిందీలో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై చీవాట్లు పెడుతూ రుచి సోయా బోర్డుకు సెబీ ఒక లేఖ రాసింది.