స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి
శుక్రవారం అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. భారీ నష్టాల తరవాత డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు శుక్రవారం చల్లబడ్డాయి. అయితే అంతకుముందు యూరో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లకు సెలవు. జపాన్ మార్కెట్ దాదాపు ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. శుక్రవారం సెలవు తరవాత ఇవాళ ప్రారంభమైన హాంగ్‌సెంగ్ మార్కెట్లో 2.3 శాతం నష్టంతో ట్రేడవుతోంది. చైనా కంపెనీ ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్‌ను హాంగ్‌కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీ సస్పెండ్ చేసింది. బాండ్లపై వడ్డీ రేట్లను చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తైవాన్ వంటి మార్కెట్లు కూడా అరశాతంపైగా నష్టంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా లేదా స్వల్ప లాభంతో ప్రారంభం కావొచ్చు.