For Money

Business News

విదేశీ కంపెనీ మూసేసిన సచిన్‌

నల్లధనం, సూట్‌కేస్‌ కంపెనీలు, మనీ లాండరింగ్‌ అంటూనే.. వెంటనే గుర్తొచ్చే పేరు బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌. నల్లకుబేరులకు స్వర్గధామం. అక్కడ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఓ కంపెనీ ప్రారంభించారు. ఇదే విషయం ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్స్‌ జర్నలిస్ట్స్‌ (ICIJ) జరిపిన పరిశోధనలో బయటపడింది. సచిన్‌ టెండూల్కర్‌కు కూడా నల్లధన స్వర్గధామం బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో కంపెనీ ఎందుకు పెట్టారనే విషమం మనకు తెలియదు కాని. కాని ICIJ పనామా పేపర్స్‌ను లీక్‌ చేసిన తరవాత తరవాత సచిన్‌ సదరు కంపెనీని మూసేశారు. తమ కంపెనీలో పెట్టుబడులు చట్టబద్ధంగానే ఉన్నాయని సచిన్‌ కంపెనీ ప్రతినిధి అంటుండగా, మరి పనామా లీక్స్‌ తరవాత ఎందుకు మూసేశారో మాత్రం చెప్పలేకపోయారు? భారత్‌కు చెందిన 380 మంది/కంపెనీలు విదేశాల్లో కంపెనీలు ప్రారంభించి… అక్కడికి నిధులను తరలించిన వైనాన్ని ICIJ నిన్న రాత్రి వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కంపెనీలకు సంబంధించి కోటి 20 లక్షల డాక్యుమెంట్లను పరిశోధించి ఈ వివరాలను వెల్లడించింది.
బ్రిటీషన్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో నెలకొల్పిన కంపెనీలో సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి టెండూల్కర్‌, మామా ఆనంద్‌ మెహతా అబ్దిదారులు, డైరెక్టర్లుగా ఉన్నారు.సాస్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (Saas International Limited) పేరుతో ఈ కంపెనీ పెట్టారు. పండారా పేపర్స్‌లో భాగంగా చూసిన పత్రాల్లో ఈ కంపెనీ పేరు 2007లో తొలిసారి ప్రస్తావనకు వచ్చింది. అంటే అప్పటి నుంచే సచిన్‌ ఈ కంపెనీ ఉందన్నమాట. ICIJ పనామా లీక్స్‌లో వందల మంది నల్లధన కుబేరుల ఖాతాలను వెల్లడించింది. దీంతో సచిన్‌ టెండూల్కర్‌ తన కంపెనీని మూసేయాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
సాస్‌ ఇంటర్నేషన్‌లో సచిన్‌కు 9 షేర్లు ఉన్నాయి. ఆయన పెట్టుబడి 8,56,702 డాలర్లు, ఆయన భార్య అంజలికి 14 షేర్లు ఉన్నాయి. ఆమె పెట్టిన పెట్టుబడి 13,75,714 డాలర్లు. సచిన్‌ మామకు 5 షేర్లు ఉండగా, ఆయన 4,53,082 డాలర్లు పెట్టుబడి పెట్టారు. 2007 పత్రాల ప్రకారం 90 షేర్లను సచిన్‌ కుటుంబం కొనుగోలు చేసింది. సగటు బైబ్యాక్‌ ధర 96,000 డాలర్లని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది. సచిన్‌ భార్య, మామకు మళ్ళీ 90 షేర్లు అలాట్‌ అయ్యాయి. మొత్తం కంపెనీ షేర్ల విలువ రూ. 60 కోట్లని పేర్కొంది. సచిన్‌ తరఫున కంపెనీని ప్రారంభించిన ఆల్కోగాల్‌ కంపెనీ అతనిని హైరిస్క్‌ కేటగిరి ఇన్వెస్టర్‌గా పేర్కొంది. రికార్డుల్లో సచిన్‌ను ఎంపీగా కూడా పేర్కొంది. అయితే లోక్‌సభ ఎంపీలు మాతమ్రే తమ పెట్టుబడుల వివరాలను బహిరంగ పర్చాల్సి ఉంది. రాజ్యసభ్యులకు ఆ నిబంధన లేదు. కంపెనీకి మూసివేత నిర్ణయానికి సంబంధించిన తీర్మానంపై సచిన్‌, అంజలి, మెహతా సంతకాలు చేశారు. ఇదే విషయమై సచిన్‌ టెండూల్కర్‌ ఫౌండేషన్‌ సీఈఓ, డైరెక్టర్‌ మ్రిన్‌మయ్‌ ముఖర్జి మాట్లాడుతూ… నిబంధనల మేరకే సచిన్‌ సదరు పెట్టుబడులు పెట్టాడని, వీటికి సంబంధించిన సమాచారం పన్ను అధికారులకు తెలిపారని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌ Liberalised Remittance Scheme (LRS) కింద సదరు పెట్టుబడులకు సచిన్‌ పన్ను కూడా చెల్లించారు. విచిత్రమేమిటంటే 2007లో LRS కింద తొలుత నిర్ణీత పని కోసం లక్ష డాలర్లు, ఆ తరవాత రెండు లక్షల డాలర్లు విదేశాలకు తీసుకెళ్ళేందుకు కేంద్రం అనుమతించింది. కాని 2013లో దీన్ని 75వేల డాలరలకు 2014లో 1.25 లక్షల డాలర్లకు తగ్గించింది. మనీలాండరింగ్‌కు ఉద్దేశించిన ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టారన్న ఆరోపణలను ఖండిస్తూ.. అంతా చట్టబద్ధంగానే జరిగిందని.. తగిన పన్నులు చెల్లించామని ముఖర్జి చెప్పారు. ICIJ పేర్కొన్నట్లు సచిన్‌ పెట్టుబడులు రూ. 60 కోట్లు కాదని పేర్కొన్నారు.
పనామా లీక్స్‌ సమయంలో కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలు, సెలబెట్రీలు ఇలాగే అన్నారు. తరవాత వీరి నుంచి ప్రభుత్వం రూ. 20,000 కోట్లను జరిమానాగా వసూలు చేసింది.