For Money

Business News

పరాస్‌ లిస్టింగ్‌ లాభం 185 శాతం

కేవలం వారం రోజుల్లో పెట్టబడి దాదాపు రెండు రెట్లు పెరగడం. పరాస్‌ డిఫెన్స్‌ చాలా చిన్న ఇష్యూ కావడం, కంపెనీ డిఫెన్స్‌ రంగానికి చెందనిది కావడంతో జనం వేలం వెర్రిగా అప్లై చేశారు. ఇష్యూ 77 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. డిఫెన్స్‌ రంగంలో రూ.1500 కోట్ల టర్నోవర్‌ అంటే చిన్న కంపెనీనే. కంపెనీ ఏడాది ఆదాయం రూ 158 కోట్లు. కేవలం 71 లక్షల షేర్లను మాత్రమే ఆఫర్‌ చేయడంతో ఇష్యూ సూపర్ సక్సెస్‌ అయింది. పరాస్‌ డిఫెన్స్‌ ఇష్యూ ఇవాళ బీఎస్‌ఈలో ఇష్యూ ధరకన్నా 171శాతం ప్రీమియం వద్ద లిస్టయింది. బీఎస్‌ఈ రూ. 475 వద్ద టిస్టయిన కంపెనీ రూ. 498.75 వద్ద ముగిసింది. పైగా ఇది అప్పర్‌ సీలింగ్‌ కావడంతో ఆగిపోయింది. ఇవాళ ఈ కౌంటర్‌లో వ్యాపారం జరిగింది కేవలం రూ.37.30 కోట్లు మాత్రమే. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మాత్రం రూ.1,948 కోట్లకు చేరింది.