MID DAY: 250 పాయింట్లు క్షీణించిన నిఫ్టి
అధిక స్థాయిలో మార్కెట్‌లో ఒత్తిడి అధికంగా ఉంది. ఈ స్థాయిలో తాజా పొజిషన్స్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. పైగా డెరివేటివ్స్ క్లోజింగ్ దగ్గర పడుతుండటంతో జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ షేర్లలో వస్తున్న ఒత్తిడి మార్కెట్‌ను కుదేలు చేస్తోంది. రిలయన్స్ జియో ప్రిపెయిడ్ ప్లాన్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయడంతో… ఎయిర్ టెల్ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం 17,912 పాయింట్లను తాకిన నిఫ్టి కొద్దిసేపటి క్రితం 17,652 పాయింట్లను తాకింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి నిఫ్టి 250 పాయింట్లకు పైగా పడింది. నిఫ్టి మరింత పతనకం కాకుండా కేవలం ప్రభుత్వ రంగ కంపెనీలు కాపాడుతున్నాయి. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, ఐఓసీ, ఓఎన్‌జీసీ ఉండగా, టాప్ లూజర్స్‌లో భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, దివీస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.