For Money

Business News

నిఫ్టి కోలుకున్నా… నష్టాలే…

మార్కెట్‌ ఇవాళ మిడ్ సెషన్‌ వరకు భారీ నష్టపోయింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపు 200 పాయింట్లు కోలుకుంది. అయినా 106 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇవాళ ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,912 గరిష్ఠ స్థాయిని తాకిన తరవాత 2.30 గంటలకల్లా ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 17576కి పడిపోయింది. అక్కడి నుంచి నిఫ్టి కోలుకున్నా … క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 17,748 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్ క్యాప్‌ సూచీ, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు కూడా అర శాతంపైగా నష్టంతో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి కన్నా ఫైనాన్షియల్స్‌ సూచీ భారీగా నష్టపోయింది. చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు నిఫ్టిని ఆదుకున్నాయి. అలాగే బ్యాంక్‌ షేర్లలో నష్టాలు తగ్గాయి.