17,900పైన ప్రారంభమైన నిఫ్టి
ఇవాళ కూడా నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17,900ను దాటి 17,912 పాయింట్లను తాకింది. ఆ వెంటనే 17,864కు క్షీణించింది. ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 22 పాయింట్ల లాభంతో 17877 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి ఐటీ షేర్లు భారీగా దెబ్బతీస్తున్నాయి. ఇవాళ టాప్ లూజర్స్ అన్ని ఐటీ షేర్లు కావడం విశేషం. అమెరికా నాస్‌డాస్ పతనం ఐటీ షేర్లపై బాగా చూపుతోంది.పైగా డాలర్ కూడా స్థిరంగా ఉంది. టాప్ గెయినర్స్‌లో చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం విశేషం. నిఫ్టి మిడ్‌క్యాప్ సూచీ 0.3 శాతం లాభంలో ఉండగా, బ్యాంక్ నిఫ్టి 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టటి 17950 స్టాప్‌లాస్‌తో పెరిగినపుడల్లా అమ్మడం ఇవాళ్టి స్ట్రాటజీగా టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు.