For Money

Business News

నిఫ్టి: మూవర్స్ అండ్ షేకర్స్‌

ఇవాళ మార్కెట్‌ స్థిరంగా ముగిసినా బ్యాంక్‌ షేర్లు బాగానే పెరిగాయి. అందుకే నిఫ్టి ఫ్లాట్‌గా ముగిసినా బ్యాంక్‌ నిఫ్టి 0.9 శాతం పెరిగింది. కాని ఆటో ఇండస్ట్రీ షేర్లు బ్యాంకులకన్నా బాగా పెరిగాయి. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో ఒక్క ఓఎన్‌జీసీ తప్ప అన్ని ఆటో షేర్లే ఉన్నాయి. ఇక క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరుగుతున్నందున ఓఎన్‌జీసీ పెరుగుతోంది. ఇక డాలర్‌ బలహీనపడటంతో… దీనిపై ఆధారపడిన ఐటీ, ఫార్మా షేర్లలో ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా ఐటీ షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి. ఇక మిడ్‌ క్యాప్‌ షేర్ల విషయానికొస్తే… ఐఆర్‌సీటీసీ ఇవాళ కూడా 5 శాతం పెరిగింది. లిస్టింగ్‌ ధరతో పోలిస్తే డబుల్‌ అయింది. ఈ స్థాయిలో ఈ షేర్‌ను ఎందుకు పెంచుతున్నారో.. అర్థం కావడం లేదు. రైల్వేలకు చెందిన కొన్ని భాగాలను ఇందులో కలుపుతారనే రూమర్‌ ఉంది. ఇక రియల్‌ ఎస్టేట్‌ విభాగం నుంచి గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ దుమ్మురేపుతోంది. చాలా రోజుల తరవాత అమర రాజా వెలుగులోకి వచ్చింది. నిఫ్టి సూచీలో మాదిరిగానే మిడ్‌ క్యాప్‌ విభాగంలోనూ ఐటీ షేర్లలో బాగా ఒత్తిడి కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
మారుతి 7,400.00 6.44
ఎం అండ్‌ ఎం 813.00 4.30
టాటా మోటార్స్‌ 331.00 4.10
ఓఎన్‌జీసీ 139.95 2.83
హీరో మోటోకార్ప్‌ 2,911.25 2.75

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,299.00 -4.36
టెక్ మహీంద్రా 1,465.00 -3.28
విప్రో 654.65 -3.23
దివీస్‌ ల్యాబ్‌ 4,944.00 -3.22
బజాజ్‌ ఫిన్‌ 18,050.00 -2.57

నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ గెయినర్స్‌
ఐఆర్‌ సీటీసీ 3,864.90 4.76
ఏయూ బ్యాంక్‌ 1,121.15 4.61
గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 2,284.00 4.22        భారత్‌ ఫోర్జ్‌ 780.50 4.09
అమర రాజా 764.40 3.89

నిఫ్టి మిడ్‌క్యాప్‌ టాప్‌ లూజర్స్‌
మైండ్‌ట్రీ 4,341.00 -5.65
కోఫోర్జ్‌ 5,430.65 -3.87
పేజ్‌ ఇండస్ర్టీస్‌ 32,770.00 -2.56
ఎస్‌టీ ఫైనాన్స్‌ 1,323.50 -2.38      ఐడియా 11.30 -1.74