For Money

Business News

హోటల్‌ షేర్లకు మంచి డిమాండ్‌

దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు బాగా సడలిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పరిస్థితి సాధారణంగా మారుతోంది. ముఖ్యంగా ప్రయాణ రంగానికి సంబంధించిన ఆంక్షలు సడలించడంతో హోటళ్ల పరిశ్రమకు కలిసి వస్తోంది. కరోనా సమయంలో ఘోరంగా దెబ్బతిన్న ఈ షేర్లను ఇపుడు ఇన్వెస్టర్లు భారీగా కొంటున్నారు. ఇవాళ హోటల్ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. అనేక షేర్లు 15 శాతం వరకు పెరిగాయి. ఇండియన్ హోటల్స్ కంపెనీ ఈస్ట్‌ ఇండియా హోటల్స్‌, చాలెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్ ఇవాళ పది శాతం పైగానే పెరిగాయి. అలాగే పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లు నిర్వహిస్తున్న వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్, తాజ్ జివికె హోటల్స్ అండ్ రిసార్ట్స్, స్పెషాలిటీ రెస్టారెంట్ల షేర్లు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి.