స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్
ఇవాళ నిఫ్టి ఆల్గో ట్రేడింగ్ గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడి స్థిరంగా ముగిసింది. ఉదయం లాభాల స్వీకరణతో కనిష్ఠ స్థాయిని తాకింది. మిడ్ సెషన్ తరవాత కోలుకుంది. జర్మనీలో వామపక్ష పార్టీ డై లింక్ పార్టీకి పూర్తి ఆధిక్యం రాకపోవడంతో మార్కెట్లు భారీగా పెరిగాయి. నిన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏంజిలా మార్కెట్ పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది. అలాగే విపక్షాలు కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. క్రిస్మస్లోగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని భావిస్తున్నారు. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలు గడించడంతో నిఫ్టి కూడా నష్టాల నుంచి బయటపడింది. ట్రేడింగ్ చివర్లో ఒత్తిడి వచ్చినా.. 2 పాయింట్ల లాభంతో 17,855 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 25 షేర్లు నష్టాల్లో, 25 షేర్లు లాభాల్లో ముగిశాయి.