కదంతొక్కుతున్న స్టాక్ మార్కెట్లు
నిన్న రాత్రి నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ నిర్ణయాలను మార్కెట్ అపుడే డిస్కౌంట్ చేస్తున్నారు. నిర్ణయాలు ఇవాళ రాత్రికి రానున్నాయి. అయితే వెంటనే కాకుండా ఈ ఏడాది చివర్లో ఉద్దీపన ప్యాకేజీకి సాయం తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి. చైనా భయాలు కూడా తగ్గాయి. దీంతో ఉదయం ఆసియా ఒక మోస్తరు లాభాలతో ముగిశాయి. యూరో మార్కెట్లు కూడా అర శాతంపైగా లాభంతో ట్రేడ్ కావడంతో మన మార్కెట్లలో నిఫ్టి17800ని దాటింది. ప్రస్తుతం 17,766 పాయింట్ల నిఫ్టి ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 2019 పాయింట్లు పెరిగింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టి నుంచి భారీ మద్దతు లభించింది. ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టి ఏకంగా రెండు శాతం దాకా లాభంతో ట్రేడవుతోంది.