For Money

Business News

భారీ లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

చైనా మార్కెట్లు మూసి ఉన్న సమయంలో రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభమంటూ ప్రపంచ మార్కెట్లు పడ్డాయి. నిన్న ప్రారంభమైన చైనా మార్కెట్‌లో పెద్ద మార్పులు లేకపోవడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగాయి. ముఖ్యంగా యూరో మార్కెట్లు, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. రాత్రి అమెరికా మార్కెట్లు డౌజోన్స్‌, నాస్‌డాక్‌ ఒక శాతంపైగా లాభంతో పెరిగాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు అర శాతం నుంచి ఒక శాతంలోపు లాభంతో ట్రేడవుతుండగా… ఇతర మార్కెట్లు ఒక శాతంపైగా లాభంతో ఉన్నాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్‌ 1.40 శాతం లాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ నిక్కీ కూడా ఒకశాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి కూడా వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.