ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిన నిఫ్టి
పాపం సాధారణ ఇన్వెస్టర్లు బలి పశువు అయ్యారు. గత కొన్ని రోజులుగా ఉదయాన్నే నిఫ్టి పడటం.. మిడ్ సెషన్ వరకు మెల్లగా.. ఆ తరవాత భారీగా పెరగడం. ఇదే తంతు వారం రోజుల నుంచి జరుగుతోంది. అమెరికా, హాంగ్‌కాంగ్ మార్కెట్ల పతనం తరవాత కూడా ఇవాళ నిఫ్టి లాభాల్లోకి రావడంతో ఇన్వెస్టర్లు ఈసారి దొరికిపోయారు. గత శుక్రవారం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు పోటీ పడి కొనడంతో… ఇక నిఫ్టి పడదని ఇన్వెస్టర్లు భావించారు. ఏకంగా 150 పాయింట్లకు పైగా రికవరితో నిఫ్టి 17,622కి చేరింది. ఉదయం రివ్యూలో హెచ్చరించినట్లు సరిగ్గా మిడ్ సెషన్‌కు ముందు నిఫ్టి బలహీనపడటం ప్రారంభమైంది. అంతే… చివరిదాకా పతనమే. 17,622 నుంచి 17,361 వరకు అంటే 250 పాయింట్లకు పైగా పడింది. ఎక్కడా ఇన్వెస్టర్లు బయటపడేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 188 పాయింట్లు క్షీణించి 17,396 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక మిడ్ క్యాప్ షేర్లలో నష్టాల దెబ్బ చాలా జోరుగా ఉంది. ఈ సూచీ 2.53 శాతం పడిందంటే అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించవచ్చు. బ్యాంక్ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్, ఫైనాన్షియల్స్.. అన్నీ 1.7 శాతం వరకు నష్టంతో ముగిశాయి. ఇన్నాళ్ళూ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించిన మెటల్స్ ఇవాళ చావుదెబ్బ తీశాయి. టాటా స్టీల్ ఏకంగా పది శాతం నష్టంతో ముగిసింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
హిదుస్థాన్ లీవర్ 2,800.60 2.88
బజాజ్ ఫిన్ సర్వ్ 17,018.60 1.06
ఐటీసీ 232.95 0.78
నెస్లే 20,320.00 0.72
హెచ్‌సీఎల్ టెక్ 1,270.40 0.56
నిఫ్టి టాప్ లూజర్స్
టాటా స్టీల్ 1,247.35 -10.00
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 629.85 -7.69
హిందాల్కో 444.00 -6.14
యూపీఎల్ 702.90 -5.31
బీపీసీఎల్ 419.50 -3.84