For Money

Business News

భారీ నష్టాలతో ప్రారంభమైనా…

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైనా… వెంటనే దిగువ స్థాయిలో మద్దతు అందింది. మరి ఇది ఎంతసేపు కొనసాగుతుందో చూడాలి. ఉదయం నిఫ్టి 17,443 పాయింట్ల వద్ద ప్రారంభమై.. 17,425 పాయింట్లకు పడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 150 పాయింట్లకు పైగా క్షీణించింది. అయితే పావు గంటలోనే నిఫ్టి భారీ నష్టాల నుంచి తేరుకుని ప్రస్తుతం 52 పాయింట్ల నష్టంతో 17,533 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి కోలుకున్నా షేర్లు మాత్రం భారీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టిలోనే 37 షేర్లు నష్టాల్లో ఉండగా… మిడ్‌క్యాప్‌ సూచీ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్స్ సర్వీసెస్, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు 0.8 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. యూరో మార్కెట్ల ఓపెనింగ్‌కు ముందు నిఫ్టిలో ఒత్తిడి వచ్చే అవకాశముంది. కాబట్టి ఇన్వెస్టర్లు అధికస్థాయిల వద్ద కొనుగోళ్ళకు దూరంగా ఉండటం బెటర్‌. డాలర్‌ బలపడినందున ఐటీ కౌంటర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌

టెక్‌ మహీంద్రా 1,488.35 2.54
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,285.25 1.74
హిందుస్థాన్‌ లీవర్‌ 2,767.00 1.64
టీసీఎస్‌ 3,866.55 1.01
ఇన్ఫోసిస్‌ 1,706.50 0.90
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా స్టీల్‌ 1,314.00 -5.19
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 661.80 -3.00
హిందాల్కో 459.40 -2.89
ఐషర్‌ మోటార్స్‌ 2,822.35 -2.63
యూపీఎల్‌ 728.85 -1.82