జీఎస్టీ జొమాటొ, స్విగ్గీ కట్టాలి
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జొమాటి వంటి సంస్థలు ఇక నుంచి జీఎస్టీ కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇది కొత్త ట్యాక్స్ కాదని, ఇప్పటి వరకు రెస్టారెంట్లు కడుతున్నాయని.. వాటికి బదులు ఎవరైతే కస్టమర్లకు అంతిమమంగా ఫుడ్ డెలివరీ చేస్తున్నారో వారు జీఎస్టీ కట్టాలని ఆమె చెప్పారు. ఇది కొత్త ట్యాక్స్ కాదని అన్నారు. అయితే జీఎస్టీ కట్టేలా తమ యాప్‌లలో మార్పులు చేసేందుకు జనవరి1 వరకు వారి టైమ్ ఇస్తామని… దీనికి సంబంధించి మరిన్ని చర్చలు జరుపుతామని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి ఇపుడు కూడా ఫుడ్ డెలివరి సంస్థలు కలెక్ట్ చేస్తున్నాయని..కాకపోతే అవి తాము కట్టకుండా… రెస్టారెంట్లకు ఇస్తున్నాయని ఆ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.