24 గంటల్లో రూ.600 కోట్ల అమ్మకాలు
ఓలా సంస్థ తమ విద్యుత్తు స్కూటర్ల అమ్మకాలను ఆపేసింది. ఆన్లైన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అంటే 24 గంటల్లోనే రూ.600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ వెహికల్స్ను విక్రయించినట్లు ఓలా తెలిపింది. సెకనుకు 4 స్కూటర్ల చొప్పున అమ్మినట్లు వెల్లడించింది. గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మకాలను ఆపేసినట్లు ఓలా సహ వ్యవస్థాపకుడు భావిష్ అగర్వాల్ తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ఎప్పటి నుంచి వెహికల్స్ సరఫరా చేసేదీ 72 గంటల్లోగా వెల్లడించనుంది.