పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీపై సెబీ నిషేధం
పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ ఎండీ అభయ్ భుటాడాపై సెబి నిషేధం విధించింది. మాగ్మా ఫిన్‌కార్ప్ షేర్లలో ఆయన ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ చేసి లాభపడ్డారనే ఆరోపణలపై సెబి నిర్ధారించింది. ఆయనను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధించింది. అభయ్‌తో పాటు పాటు మరో ఏడుగురిని దోషులుగా తేల్చింది. మాగ్మా ఫిన్‌కార్ప్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో అదర్ పూనావాలాకు చెందిన రైజింగ్ సన్ హోల్డింగ్స్ (ఆర్ఎస్హెచ్పీఎల్) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఫిబ్రవరి 10న వెలువడింది. యాజమాన్యం మారిన తర్వాత మాగ్మా ఫైనాన్స్‌ను, పూనావాలా ఫిన్కార్ప్గా పేరు మార్చారు. మాగ్మా ఫిన్‌కార్ప్‌ను కొనుగోలు చేస్తున్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న అభయ్ భుటాడాతో పాటు సౌమిల్ షా, సురభి కిషోర్ షా, అమిత్ అగ్రవాల్, మురళీధర్ బగ్రాంగ్లాల్ అగ్రవాల్, అభిజిత్ పవార్ తదితరులు ముందుగానే మాగ్మా షేర్లు కొనుగోలు చేసి రూ.13.58 కోట్ల మేరకు లాభపడ్డారని సెబీ నిర్ధారించింది.