స్విగ్గి, జొమాటొ డెలివరీపై 5 శాతం జీఎస్టీ?
మరో రూ. 2000 కోట్లు జీఎస్టీ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఫుడ్ డెలివరీ యాప్స్‌ను నిర్వహించే జొమాటొ, స్విగ్గి కంపెనీలు ఇక నుంచి తాము అందించే సేవలపై 5 శాతం జీఎస్టీ విధించే అవకాశముంది. ఎల్లుండి లక్నోలో సమావేశం కానున్న జీఎస్టీ కౌన్సిల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చకు రానుంది. రెస్టారెంట్ సేవల స్థానంలో ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలను చేర్చుతున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా అనేక రిజస్టర్ వ్యాపారస్థులు వ్యాపారాలు చేస్తున్నారు. వారందరూ జీఎస్టీ ఎగ్గొడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి వీటిపై జీఎస్టీని ఈ కామర్స్ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి వసూలు చేయాలని భావిస్తోంది. ఫుడ్ బిజినెస్ వ్యాపారం భారీ మొత్తంలో ఉంటుంది కాబట్టి… 5 శాతం జీఎస్టీ విధించాలని భావిస్తున్నారు. నిర్ణయం తీసుకున్న తరవాత… తమ సాఫ్ట్వేర్లలో మార్పులు చేసుకునేందుకు జనవరి వరకు గడువు ఇవ్వొచ్చని తెలుస్తోంది.